![]() |
![]() |

క్యాష్ షో చూసే ఆడియన్స్ కి క్యాష్ రాకపోవచ్చేమో కానీ మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం ప్రతీ వారం అందుతూ ఉంటుంది. ఇక స్పాంటేనియస్ యాంకర్ గా సుమను తప్ప ఇంకొకరిని అస్సలు ఊహించుకోలేం. అందుకే ఈ షోకి సుమ అలా ఫిక్స్ ఐపోయింది. ఎంతో వినోదాన్ని పంచుతూ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూ అలరిస్తూ ఉంటుంది సుమ. సుమ చాలా కామెడీగా ఉంటూ టైమింగ్ తో కూడిన పంచెస్ వేస్తూ ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది.
ఇక లేటెస్ట్ గా ఈ షోకి టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, సుభాషిణి, జెన్నీ, బాలాజీ వచ్చారు. ఈ సీనియర్ యాక్టర్స్ తో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా రిలీజ్ ఐన ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక జెన్నీని ఒక రేంజ్ లో ఆడేసుకుంది సుమ. ఆయన ఎన్నో మూవీస్ లో సీరియల్స్ లో కామెడీ రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. జెన్నీ గారు మీ పెళ్ళికి ముందు ఏవైనా ప్రేమ కథలు ఉన్నాయా అంటూ సుమ అడిగింది. దాంతో సుభాషిణి పెళ్లికి ముందేనా ఇప్పుడు కూడా ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయని చెప్పేసరికి అందరూ నవ్వేశారు.
ఇక జెన్నీ కూడా కౌంటర్ డైలాగ్ వేసేసారు. నీ పర్సనల్ విషయాలు నా మీద రుద్దకు అనేసారు. ఇక ఇంత పెద్ద వయసులో కూడా జెన్నీ చాలా చలాకీగా ఉంటూ స్క్రీన్ మీద చూపించినట్టుగా ఒక కష్టమైన ఆసనం వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఎపిసోడ్ ఎండింగ్ లో సుభాషిణి కాస్త ఎమోషన్ అయ్యింది. సుమకి సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ని ఈ ఎపిసోడ్ లో షేర్ చేసుకుంది. ఇలా అందరి ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం సుమ. ఒకానొక సమయంలో ఆరోగ్యం బాగాలేకపోతే సుమనే సాయం చేసిందని తెలిపింది. ఇప్పటికీ ప్రతీ ఆరు నెలలకోసారి మెడిసిన్ పంపిస్తూ తనను చూసుకుంటోందని చెప్పుకొచ్చింది. ఆ మాటలకు సుమ వచ్చి సుభాషిణిని ఆప్యాయంగా హగ్ చేసుకుంది. ఆ భావోద్వేగంతో సుమ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. మరో జన్మ అంటూ ఉంటే నీకు తల్లిగా పుట్టాలి అని అన్నారు సుభాషిణి. ఇలా ఈ ఎపిసోడ్ నవ్వులతో, అక్కడక్కడా కంటి చెమ్మతో సాగుతుంది. ఈ ఎపిసోడ్ జులై 16 న ప్రసారం కానుంది.
![]() |
![]() |